News April 17, 2025

రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్ 

image

జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో జేసీ విధ్యాదరితో సమీక్షించారు. భూ సమస్యల పరిష్కారానికి MROలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మ్యూట్యుయేషన్లు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, జీవో నంబర్.30 ప్రకారం ప్రభుత్వ భూముల రెగ్యులరైజేషన్ అంశాలను పరిశీలించాలన్నారు.

Similar News

News April 20, 2025

సదుం: అధికారుల తీరుతో విసిగి ACBకి ఫిర్యాదు 

image

రెవెన్యూ అధికారుల తీరుతో విసిగి ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు బాధిత రైతు షఫీ ఉల్లా తెలిపారు. తనకు సంబంధించిన 5.60 ఎకరాల సెటిల్మెంట్ భూమిని అధికారులు అసైన్మెంట్‌గా మార్పు చేశారని.. తిరిగి దానిని సెటిల్మెంట్‌గా నమోదు చేసేందుకు రూ.1.50 లక్షల నగదును డిమాండ్ చేశారని ఆయన వాపోయారు. దానిని చెల్లించేందుకు ఇష్టం లేకనే ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి తాహశీల్దార్, వీఆర్ఓలను పట్టించినట్లు చెప్పారు.

News April 20, 2025

చిత్తూరు: రైలు నుంచి పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

గంగాధరనెల్లూరు మండలం నల్లరాళ్ళపల్లికి చెందిన హేమాద్రి ఆచారి కుమారుడు ప్రవీణ్ కుమార్ శనివారం రైలు నుంచి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న ప్యాసింజర్ రైలులో పూతలపట్టు సమీపంలోని ముత్తురేవులు వద్ద జారిపడి మృతి చెందాడు. తండ్రి సైతం జనవరిలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సమాచారం తెలుసుకున్న జీడీ నెల్లూరు గ్రామంలో, కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 20, 2025

DSC: చిత్తూరు జిల్లాలో 1,473 పోస్టుల భర్తీ

image

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1,473 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:38
➤ హిందీ:17 ➤ ఇంగ్లిష్: 104
➤ గణితం: 30 ➤ఫిజిక్స్: 29
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 130
➤ పీఈటీ: 86 ➤ఎస్జీటీ: 976
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో మ్యాథ్స్ 1, ఫిజిక్స్ 1, జీవశాస్త్రం 1, ఎస్టీటీ 2 పోస్టులు భర్తీ కాబోతున్నాయి.

error: Content is protected !!