News March 17, 2025
రేగొండ: భార్యాభర్తల మధ్య గొడవ.. భర్త ఆత్మహత్య

రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన చావడి లక్ష్మి నరసయ్య(50) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న నరసయ్య.. కుటుంబ ఆర్థిక విషయాల్లో భార్యాభర్తలు గొడవ పడినట్లు చెప్పారు. కాగా మనస్తాపం చెందిన నరసయ్య ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు.
Similar News
News March 17, 2025
జగిత్యాల: పొలంలో మంచెలు.. అవే రక్షణ కంచెలు..!

పొలంలో మంచెలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పల్లెటూర్లు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు గుట్టల ప్రాంతాల్లో అడవి జంతువుల దాడి నుంచి తమను తాము రక్షించుకోవడానికి, పక్షులు, జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఇలాంటి మంచెలు నిర్మించుకుంటారు. పట్టణంలోని ఏసీ రూములను తలపించే ఇలాంటి మంచెల్లో సేద తీరితే వచ్చే ఆనందమే వేరని పల్లెటూరి వాసులు, ప్రకృతి ప్రేమికులు అంటుంటారు.
News March 17, 2025
బట్టతలపై భార్య హేళన.. భర్త బలవన్మరణం

కర్ణాటకలోని చామరాజనగర ప్రాంతానికి చెందిన పరాశివమూర్తి, మమత భార్యాభర్తలు. పెళ్లినాటికే బట్టతల ఉన్నప్పటికీ మమత అతడిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లయ్యాక మాత్రం ‘నీతో బయటికి వెళ్లాలంటే అవమానంగా ఉంటోంది. తలపై జుట్టూ లేదు చేతిలో డబ్బూ లేదు’ అంటూ నరకం చూపించేది. వరకట్నం కేసు పెట్టి అతడిని నెలన్నరపాటు జైలుకు పంపించింది. తాజాగా బెయిల్‌పై బయటికొచ్చిన మూర్తి, ఆ బాధల్ని తట్టుకోలేక తనువు చాలించాడు.
News March 17, 2025
అన్నమయ్య: యువతిపై అత్యాచారం.. ఆపై హత్య

మర్రిపాడులో ఓ రైస్ మిల్ యజమాని కర్ణాటక యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడని సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా యువతి మృతదేహాన్ని కర్ణాటకకు రాత్రికి రాత్రే తరలించాడు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం మర్రిపాడులో వారం రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు(24), ఓ యువతి(21) పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని వస్తే ఇలా జరిగింది.