News April 13, 2025
రేగొండ: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన నీటూరి నీలమ్మ (59) ఆదివారం ఉదయం ఇంటి వద్ద పనులు చేస్తూ కిటికీ ఊచలను పట్టుకుంది. ఇంట్లోకి వెళ్లే విద్యుత్ తీగలు కిటికికీ తాకడంతో కిటికీని పట్టుకున్న నీలమ్మకు షాక్ కొట్టగా అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 15, 2025
ట్రాఫిక్ చలాన్ల జారీలో కీలక మార్పులు!

వాహనదారులకు విధించే చలాన్లపై కేంద్రం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని తీసుకొచ్చింది. చలాన్లు విధించే ఆటోమేటెడ్ కెమెరాలు కనీసం 10 సెకన్ల ఫుటేజ్‌ను రికార్డ్ చేయాలని ఆదేశించింది. ట్రాఫిక్ చలాన్ల అమలులో పారదర్శకతను పెంచేందుకు ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలిపింది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1-10 సెకన్ల వీడియోతో పాటు, టైమ్, లొకేషన్ చూపేలా చలాన్‌లో స్పష్టంగా కనిపించాలని తెలిపింది.
News April 15, 2025
మచిలీపట్నం: రెవెన్యూ సమస్యలపై దృష్టిసారించాలి – కలెక్టర్

రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవెన్యూ సమస్యలపై జిల్లా స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా భూముల అలినేషన్, 22Aలో ఉన్న ప్రైవేటు భూములు, భూముల అసైన్మెంట్, ఇనాం భూములు, ROR & వెబ్ ల్యాండ్, రీసర్వే తదితర రెవెన్యూ అంశాలలో తలెత్తుతున్న సమస్యలను చర్చించారు.
News April 15, 2025
వైఎస్ జగన్ పర్యటనలో ఘటనపై పోలీసుల విచారణ

AP: వైఎస్ జగన్ అనంతపురం జిల్లా పర్యటనలో జరిగిన ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పాపిరెడ్డిపల్లిలో జగన్‌ను తీసుకొచ్చిన హెలికాప్టర్‌ను కార్యకర్తలు, అభిమానులు చుట్టుముట్టారు. అదే సమయంలో హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ టేకాఫ్ చేసుకుని వెళ్లిపోయారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు పైలట్, కో-పైలట్‌కు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని సూచించారు.