News March 8, 2025
రేగోడ్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: మంత్రి

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళాభివృద్ధి, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దామోదర్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రుల నివాసంలో ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వీట్లు పంపిణీ చేశారు. మహిళలకు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 9, 2025
మెదక్: భర్త మృతి.. మూడు రోజులకు భార్య మృతి

చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భర్త మృతి చెందిన మూడు రోజులకే భార్య మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొన్నది. కర్నాల్ పల్లి గ్రామానికి చెందిన చింతాకుల ఐలయ్య మూడు రోజుల క్రితం మరణించగామూడు రోజులకే ఇవాళ ఉదయం భార్య కొమురవ్వ అకస్మాత్తుగా మృతి చెందింది. భార్యాభర్తలు మూడు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో విషాదం నెలకొన్నది.
News March 9, 2025
మెదక్: విషాదం.. మామ, కోడళ్లు మృతి

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఒకేరోజు మామ కోడలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మక్కరాజుపేట కు చెందిన ఆరేళ్ల సుమలత (35) వారం రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి మామ పోచయ్య (35) తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరగగా పోచయ్య గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న పోచయ్య ఈరోజు మృతిచెందగా, అస్వస్థతకు గురైన కోడలు సైతం మృతి చెందింది.
News March 9, 2025
మెదక్లో లోక్ అదాలత్.. 1500 కేసుల్లో రాజీ

మెదక్ జిల్లాలోని కోర్టు ప్రాంగణాల్లో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ఆధ్వర్యంలో 1500 కేసుల్లో రాజీ పడ్డారు. రూ.46 లక్షల 32వేల పరిహారం ఇప్పించారు. సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి సిరి సౌజన్య, మొబైల్ కోర్టు జడ్జి సాయి ప్రభాకర్, డీఎస్పీ ప్రసన్నకుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.