News June 29, 2024

రేపు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు

image

నేడు మరణించిన పీసీసీ మాజీ అధ్య‌క్షుడు డి.శ్రీ‌నివాస్ (డీఎస్‌) పార్ధీవదేహానికి రేపు అధికారిక లాంఛ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు నిర్వహించనున్నారు. ఈ మేరకు త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)ని ఆదేశించారు. ఈ మేరకు రేపు డీఎస్ స్వస్థలం నిజామాబాద్ లో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.

Similar News

News February 9, 2025

NZB: ప్రజావాణి తాత్కాలిక వాయిదా: కలెక్టర్

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శాసన మండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా ఉంటుందని వివరించారు.

News February 8, 2025

ఢిల్లీలో బీజేపీ విజయంపై ఎంపీ అర్వింద్ హర్షం

image

ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ హర్షం వ్యక్తం చేశారు. తాను ప్రచారం చేసిన అసెంబ్లీ నియోజకవర్గాలు ఆర్కే పురం, జంగ్ పుర నుంచి బీజేపీ అభ్యర్థులు అనిల్ శర్మ, తర్వీందర్ సింగ్ విజయం సాధించడంతో శనివారం ఢిల్లీలో వారిని ఎంపీ కలిసి అభినందించారు. ఈ విజయాన్ని ప్రధాని మోడీకి అంకితం ఇస్తున్నట్లు అర్వింద్ పేర్కొన్నారు.

News February 8, 2025

ఆర్మూర్‌: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని శనివారం పరిశీలించారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సంపంగి నరసయ్య(41) తన ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి అనుమానాస్పదంగా మృతి చెందాడని చెప్పారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్లు సీఐ వివరించారు.

error: Content is protected !!