News March 14, 2025
రేపు అహోబిలానికి చీఫ్ సెక్రటరీ విజయానంద్ రాక

ఏపీ చీఫ్ సెక్రటరీ కే.విజయనంద్ శనివారం అహోబిలం క్షేత్రానికి రానున్నట్లు మండల తహశీల్దార్ జ్యోతి రత్నకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. అహోబిలం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు చీఫ్ సెక్రటరీ, కలెక్టర్ రాజకుమారి రానున్నట్లు తెలిపారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ రాక సందర్భంగా ప్రోటోకాల్ అనుసరించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తహశీల్దార్ తెలిపారు.
Similar News
News March 15, 2025
నేటి నుంచి ఒంటిపూట బడులు.. మ.12.30 గంటల వరకే స్కూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. తెలంగాణలో ఉ.8 గంటల నుంచి మ.12:30 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మ.1:00 నుంచి సా.5:00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి. ఇక ఏపీలో ఉ.7:45 నుంచి మ.12:30 బడులు కొనసాగనున్నాయి. పదోతరగతి పరీక్ష కేంద్రాలున్న స్కూళ్లలో మ.1:15 నుంచి సా.5 గంటల వరకు తరగతులు ఉంటాయి.
News March 15, 2025
ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 15, 2025
నేడు తణుకులో సీఎం పర్యటన

AP: సీఎం చంద్రబాబు ఇవాళ తణుకులో పర్యటించనున్నారు. ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్’లో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉ.7.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 8.05కు తణుకు చేరుకుంటారు. పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారు. అనంతరం పార్టీ శ్రేణులు, అధికారులతో సమావేశమై 12.55 గంటలకు ఉండవల్లికి బయలుదేరుతారు. సీఎం రాక నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.