News May 9, 2024
రేపు ఒంగోలుకు రానున్న చంద్రబాబు

TDP అధినేత నారా చంద్రబాబు రేపు ఒంగోలులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఆయన ఒంగోలుకు చేరుకుంటారు. అనంతరం నగరంలో రోడ్ షో నిర్వహించి, రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 11వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లా, పూతలపట్టుకు వెళ్తారు. దీంతో దామచర్ల జనార్దన్‌కు సమాచారం అందగా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. మొదటగా చంద్రబాబు 11వ తేదీ ఒంగోలుకు రావాలి. కానీ ఆయన పర్యటన ఒక రోజు ముందుకు మారింది.
Similar News
News April 24, 2025
రాష్ట్రంలో చివరి స్థానంలో ప్రకాశం జిల్లా

ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో రాష్ట్రంలో ప్రకాశం జిల్లా చివరి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్‌లో 3,668 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే.. 547 మంది పాస్ అయినట్లు అధికారులు వెల్లడించారు. 14.9 శాతంతో రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా 26వ స్థానంలో నిలిచింది. అలాగే ఓపెన్ టెన్త్‌లో 1,184 మంది పరీక్షలు రాస్తే.. 88 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 7.4 శాతంతో జిల్లా 21వ స్థానంలో నిలిచింది.
News April 24, 2025
పొదిలి: రోడ్డుపై మద్యం లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

పొదిలి మండలం సలకనూతల వద్ద మార్కాపురం నుంచి దర్శికి మద్యం లోడ్‌తో వెళుతున్న వాహనం బుధవారం ప్రమాదానికి గురై రోడ్డుపై బొల్తాపడింది. మద్యం బాటిళ్లు రోడ్డుపై పడగా.. మద్యం ప్రియులు వాటి కోసం ఎగబడ్డారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
News April 24, 2025
ఒంగోలు: రేషన్ మాఫియా డాన్ పనేనా..?

వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్‌కు సహకరించారన్న అనుమానాలతో నిడుబ్రోలుకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, వీళ్లు ఎన్నికల్లో YCPకి అనుకూలంగా పనిచేశారని సమాచారం.