News January 21, 2025
రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఉత్తమ్
రేపు నీటిపారుదల మరియు పౌర సరఫరాలశాఖ మంత్రి జిల్లా ఇన్‌ఛార్జి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో నిర్వహించే గ్రామసభలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం గంగాధర మండలంలో నిర్వహించనున్న గ్రామసభ పాల్గొంటారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News January 22, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభం
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం ఆన్లైన్ సేవలను ఆలయ కార్యనిర్వాహణ అధికారి కొప్పుల వినోద్ రెడ్డి ప్రారంభించారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే వివిధ పూజలు, అలాగే వసతి గదిలో వివరాలను ఆన్లైన్లో పొందుపరిచిట్లు ఆయన తెలిపారు. https://vemulawadatemple.telangana .gov.in/ అనే వెబ్ సైట్లో ఉంచినట్లు తెలిపారు.
News January 22, 2025
నేడు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఇద్దరు మంత్రులు జిల్లాకు రానున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ రానున్నారు. రేణిగుంట, నారాయణపూర్, రుద్రంగి, జైన గ్రామాలలో జరిగే గ్రామసభలో పాల్గొంటారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
News January 22, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,38,986 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.94,801, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.37,180, అన్నదానం రూ.7,005, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.