News December 27, 2024

రేపు కాకినాడకు రానున్న సినీ నటులు

image

ప్రముఖ సినీ నటుడు, విక్టరీ వెంకటేశ్ శనివారం కాకినాడలో ఓ ప్రైవేట్ ఛానల్ నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు ఉత్సవంలో పాల్గొననున్నారు. పీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో జరగనున్న సంక్రాంతి సంబరాల్లో వెంకటేశ్‌తోపాటు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, ఆమని, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి పాల్గొననున్నారు. సినీ నటుల రాక కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News December 28, 2024

గోకవరం: 144 సెక్షన్ అమలు.. ఇద్దరు అరెస్ట్ 

image

గోకవరం మండలం గుమ్మల దొడ్డి గ్రామంలో అలస్కాలో బాధితులు శనివారం తలపెట్టిన అఖిలపక్ష సమావేశాన్ని పోలీసులు భగ్నం చేశారు. గ్రామంలో 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా సమావేశాన్ని నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. తమ సమస్యలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోరుకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News December 28, 2024

సర్వే ఆధారంగా కచ్చితమైన నివేదికలు ఇవ్వాలి: కలెక్టర్

image

సముద్ర తీరా ప్రాంత ఆక్వా జోన్, ఆక్వాయేతర జోన్లలో ఎంత మేర విస్తీర్ణంలో ఆక్వా చెరువులు ఉన్నాయనే అంశంపై జియో కో-ఆర్డినేట్ మ్యాపులతో సహా బృందాలు సర్వే ఆధారంగా కచ్చితంగా నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కాలుష్య నియంత్రణ మండలి, భూగర్భ జల శాఖ, మత్స్య శాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆక్వా చెరువుల అనుమతులపై వివరాలు తెలుసుకున్నారు

News December 27, 2024

ఈవీఎంలకు పటిష్ట భద్రత: కలెక్టర్

image

ఈవీఎం, వీవీపాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కలెక్టరేట్ ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రెవిన్యూ, ఎన్నికలు అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.