News April 13, 2025

రేపు చిత్తూరులో పీజీఆర్ఎస్ రద్దు 

image

ఈనెల 14న బీఆర్ అంబేడ్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను రద్దు చేస్తున్నట్లు ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. అర్జీదారులు పోలీస్ కార్యాలయంలో నిర్వహించే పీజీఆర్ఎస్‌కు రావొద్దని తెలిపారు. ప్రజలు ఈవిషయాన్ని గమనించాలని కోరారు. 

Similar News

News May 8, 2025

మంత్రి లోకేశ్‌తో ఎమ్మెల్యే థామస్ భేటీ

image

తిరుపతి జిల్లా పర్యటన నిమిత్తం శ్రీ సిటీకి చేరుకున్న మంత్రి లోకేశ్‌ను GDనెల్లూరు ఎమ్మెల్యే థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని థామస్, మంత్రిని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఆయన పేర్కొన్నారు.

News May 7, 2025

28న చిత్తూరులో జాబ్ మేళా

image

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 19 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కోరారు.

News May 7, 2025

సీఎంను కలిసిన రామకుప్పం టీడీపీ నాయకులు 

image

ఇటీవల జరిగిన రామకుప్పం ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలుపొందిన సులోచన గుర్రప్ప, వెంకట్రామయ్య గౌడు శనివారం సీఎం చంద్రబాబును కలిశారు. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎంను కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రామకుప్పం మండలాభివృద్ధికి సంబంధించి పలు విషయాలను వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.