News March 15, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: ఆంజనేయులు

రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.
Similar News
News March 16, 2025
విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: కలెక్టర్

మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి పలు సూచనలు చేశారు.
News March 16, 2025
TB పేషెంట్స్‌కు ఉచితంగా పౌష్టికాహారం: మంత్రి దామోదర్

తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో TB పేషెంట్లకు ఫుడ్ కిట్లను అందించేందుకు అసోసియేషన్ తరపున రూ.25 లక్షల(CSR)నిధులను మంత్రి దామోదర్ రాజనర్సింహ కలిసి అందజేశారు. తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అందించిన CSR నిధులను టీబీ పేషెంట్లకు 6 నెలల పాటు ఉచితంగా పౌష్టికాహారం అందించేందుకు ఖర్చు పెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శి డా. క్రిస్టినా పాల్గొన్నారు.
News March 16, 2025
రాజకీయ పార్టీలతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. నూతన ఓటరుగా నమోదు చేసుకున్న ఫారమ్ 6, 7, 8లను పరిశీలించి పూర్తి చేయాలని పేర్కొన్నారు. బిఎల్ఏలు, గ్రామ స్థాయి అధికారులు దరఖాస్తులను పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈవీఎంల మీద సందేహాలను నివృత్తి చేయడం జరిగిందని తెలిపారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఖర్చుల నివేదికలు త్వరగా అందించాలన్నారు.