News April 13, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ఈనెల 14 సోమవారం ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పిజిఆర్ఎస్)ను రద్దు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు సెలవు కావడంతో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు తెలిపారు.
Similar News
News April 16, 2025
కాంగ్రెస్ కుంభకోణాల్ని ప్రజలు మర్చిపోలేదు: కిషన్ రెడ్డి

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ చేర్చిన అంశంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేయడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘కాంగ్రెస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం మానుకోవాలి. ధర్నాలు చేసినంత మాత్రాన వారి అవినీతి, అక్రమాలు సమసిపోవు. ప్రజలింకా బోఫోర్స్, బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, హెలికాప్టర్ల కుంభకోణాల్ని మర్చిపోలేదు. ఈ కేసు విచారణ జరగాలని కోర్టులు తేల్చి చెప్పాయి’ అని పేర్కొన్నారు.
News April 16, 2025
మొదటి విడతలో 3,23,453 మంది లబ్ది: జేసీ

అనకాపల్లి జిల్లాలో దీపం పథకం కింద మొదటి విడతలో 3,23,453 మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేసినట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. ఈనెల 1వ తేదీ నుంచి రెండవ విడతలో ఉచిత గ్యాస్ సిలిండర్ పొందవచ్చునన్నారు. ఈ మేరకు ఆమె బుధవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జూలై 31వ తేదీ వరకు ఉచితంగా గ్యాస్ పొందేందుకు గడువు ఉందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
News April 16, 2025
పెన్‌పహాడ్ ఠాణాను సందర్శించిన జిల్లా ఎస్పీ

సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం జిల్లా ఎస్పీ నరసింహ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మండలంలోని శాంతిభద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు చోటు లేకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్లో రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని సూచించారు.