News January 26, 2025
రేపు ప్రభుత్వం లాంచ్ చేయబోయే 4 పథకాల కోసం ఎంపికైన గ్రామాలు
చిగురుమామిడి – గునుకులపల్లి, చొప్పదండి – చిట్యాలపల్లి, ఇల్లందకుంట – బోగంపాడు, గంగాధర – కురిక్యాల, హుజూరాబాద్ – ధర్మరాజుపల్లి, జమ్మికుంట – గండ్రపల్లి, కరీంనగర్ రూరల్ – బహద్దూర్ ఖాన్ పేట, కొత్తపల్లి – బద్దిపల్లి, మానకొండూర్- ముంజంపల్లి, రామడుగు – దేశరాజ్ పల్లి, శంకరపట్నం – ఇప్పలపల్లి, తిమ్మాపూర్ – కొత్తపల్లి, సైదాపూర్ – వెన్కెపల్లి, వీణవంక – శ్రీరాములపేట, గన్నేరువరం – గుండ్లపల్లి
Similar News
News January 27, 2025
కరీంనగర్: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి ఫిర్యాదులను వివిధ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించగా ప్రజావాణికి మొత్తం 298 దరఖాస్తులు రాగా ఇందులో అత్యధికంగా కరీంనగర్ నగర పాలిక సంస్థకు 45, కరీంనగర్ రూరల్ తహశీల్దార్ కార్యాలయానికి 18, కొత్తపెల్లి తహశీల్దార్ కార్యాలయానికి 13 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
News January 27, 2025
KNR: టాస్క్ ఆధ్వర్యంలో ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు
ఉచిత టెక్నికల్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. ఇంజినీరింగ్, డిగ్రీ ఉత్తీర్ణులై సాప్ట్వేర్ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకి టెక్నికల్ స్కిల్స్ కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ తరగతులకు హాజరు కావాలనుకున్న అభ్యర్థులు ఈ నెల 29 సాయంత్రం 5 గంటలలోపు KNR IT టవర్ లోని మొదటి అంతస్తులో గల టాస్క్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News January 27, 2025
కరీంనగర్: కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ నగరపాలక సంస్థ పాలకవర్గ పదవీకాలం ఈ నెల 28తో ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారిగా కలెక్టర్ పమేలా సత్పతిని నియమించింది. ఆదివారం జమ్మికుంట, హుజురాబాద్, చొప్పదండి మున్సిపాలిటీల పాలకవర్గం పదవీకాలం ముగియడంతో ఆ మూడు మున్సిపాలిటీలకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ప్రపుల్ దేశాయ్ని నియమించింది.