News December 29, 2024

రేపు యధావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు ఆమె ఆదివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 4, 2025

రాజమండ్రికి మెగాస్టార్ చిరంజీవి..?

image

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ‘గేమ్ ఛేంజ‌ర్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఇవాళ రాజమండ్రిలో గ్రాండ్‌గా జరగనుంది. చీఫ్ గెస్ట్‌గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అయితే ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో మెగా కుటుంబం అంతా ఒకే వేదికపై కనిపిస్తుందనే జోష్ అభిమానుల్లో నెలకొంది. సా.6 గంటలకు వేమగిరి జాతీయ రహదారి పక్కనున్న లేఅవుట్‌లో ఈవెంట్ ప్రారంభం కానుంది.

News January 4, 2025

కాకినాడ జిల్లాలో ఎయిర్‌పోర్టుపై CM కీలక ప్రకటన

image

ఉమ్మడి తూ.గో జిల్లా పరిధిలో ఇప్పటికే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కాకినాడ జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈమేరకు CM చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అన్నవరం, తుని మధ్య ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఈ మేరకు ఆ ఏరియాలో 757 ఎకరాలను గుర్తించినట్లు సీఎం నిన్నటి సమీక్షలో వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.

News January 4, 2025

తూ.గో: నేటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

జిల్లాలో 15 జూనియర్ కళాశాలలో శనివారం నుంచి మధ్యాహ్న భోజన పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. స్ధానిక జిల్లా మంత్రి దుర్గేష్, ఇతర ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న 5,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నారు.