News April 25, 2024
రేపు రాజంపేటకు పవన్, చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు గురువారం రాజంపేటకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట, రైల్వేకోడూరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అనంతరం ఇద్దరు హెలికాప్టర్‌లో తిరుపతికి వెళతారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలు అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిసారి జిల్లాకు పవన్, చంద్రబాబు కలిసి రానుండటంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సభలో పాల్గొననున్నారు.
Similar News
News April 23, 2025
కడప జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News April 22, 2025
కడప జిల్లా నూతన జడ్జిని కలసిన ఎస్పీ

కడప జిల్లా నూతన జడ్జిగా యామిని నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని చర్చించుకున్నారు. కేసుల పరిష్కారం, మహిళల భద్రత, నేరాల నివారణపై మాట్లాడుకున్నారు.
News April 22, 2025
దళితులకు అన్యాయం జరగకూడదు: కలెక్టర్

దళితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని, కడప జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలాని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆదేశించారు. తన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు.