News March 25, 2025
రేపు విజయవాడకి రానున్న మాజీ సీఎం జగన్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందుకి రానున్నారు. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఎమ్మెల్సీ రుహుల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మాజీ సీఎం జగన్ రానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాషా, మైనార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు.
Similar News
News March 30, 2025
ఇండోనేషియాలోనూ భూకంపం

ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా ప్రాంతంలో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైందని ఆ దేశ భూకంప పరిశీలన కేంద్రం తెలిపింది. భూ ఉపరితలానికి 18 కి.మీ లోతున భూకంప కేంద్రం నెలకొని ఉందని పేర్కొంది. థాయ్‌లాండ్, మయన్మార్ దేశాలను భారీ భూకంపం కుదిపేసిన రోజుల వ్యవధిలోనే తమ వద్దా భూకంపం రావడంతో ఇండోనేషియావాసులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
News March 30, 2025
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

బాపట్ల జిల్లాలో శనివారం జరిగిన వేర్వేరు ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. పంగులూరు మండలం అలవలపాడు గ్రామంలో ఆటో ప్రమాదంలో షేక్ అషీర్ బీ, కొమ్ము సులోచన చనిపోయారు. చెరుకుపల్లి మండలం ఆళ్లవారిపాలెంలో తాటిచెట్టు పైనుంచి పడి నాగారజు(39) మృతి చెందాడు. చీరాల రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని కొండేపి సుబ్బారావు, మరో ఘటనలో స్టూవర్టుపురం-బాపట్ల రైల్వే స్టేషన్ల మధ్య ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.
News March 30, 2025
కరీంనగర్: దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకులాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం.. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్సీవో అంజలి కుమారి తెలిపారు. ఆన్‌లైన్లో దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31 వరకు అవకాశం ఉందన్నారు. ఏప్రిల్ 20న పరీక్ష జరుగుతుందని, అందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రిజర్వేషన్, నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.