News February 23, 2025
రేపు శ్రీశైలానికి ఏపీ గవర్నర్ రాక

శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం రానున్నారు. గత నెల 17న శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గవర్నర్‌ని కలిసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు గవర్నర్ శ్రీశైలం పర్యటన ఖరారైంది. 24న ప్రత్యేక హెలికాప్టర్లో గవర్నర్ సుండిపెంట చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి 25న తిరిగి వెళ్తారు.
Similar News
News February 23, 2025
BREAKING: గ్రూప్-2 ‘ఇనిషియల్ కీ’ విడుదల

AP: ఇవాళ నిర్వహించిన గ్రూప్-2 మెయిన్స్ ‘ఇనిషియల్ కీ’ని APPSC విడుదల చేసింది. https://portal-psc.ap.gov.inలో కీ చూసుకోవచ్చు. అభ్యర్థులకు ప్రశ్నలు, కీపై సందేహాలు ఉంటే ఏపీపీఎస్సీ సైట్ ద్వారా ఈ నెల 25 నుంచి 27 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని పేర్కొంది. పోస్ట్, ఫోన్, SMS, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. కీ కోసం ఇక్కడ <
News February 23, 2025
ఆ సమయంలో డిప్రెషన్‌కు లోనయ్యా: ఆమిర్ ఖాన్

లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం తనను ఎంతో బాధించిందని ఆమీర్ ఖాన్ అన్నారు. కొంతకాలం పాటు డిప్రెషన్‌కు లోనైనట్లు తెలిపారు. తన చిత్రాలు సరిగ్గా ఆడకపోతే రెండు, మూడు వారాలు డిప్రెషన్‌లో ఉంటానని అనంతరం సినిమా ఫెయిల్యూర్‌కు కారణాలు టీంతో కలిసి చర్చిస్తానని ఆమిర్ పేర్కొన్నారు. 2022లో ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన లాల్‌సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
News February 23, 2025
ప్రకాశం: గ్రూప్- 2 మెయిన్స్‌కు 579 మంది గైర్హాజరు.!

ప్రకాశం జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టరేట్ ప్రకటించింది. పేపర్- 1కు మొత్తం 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 3968 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 576 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలాగే పేపర్- 2 పరీక్షకు 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 3965 మంది హాజరయ్యారు. 579 మంది గైర్హాజరయ్యారు.