News February 11, 2025
రేపే మేడారం జాతర!
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.
Similar News
News February 11, 2025
వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ ఆవిష్కరణ
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం వైసీపీ పంచాయితీరాజ్ విభాగం డైరీ 2025ను వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించారు. గ్రామ స్వరాజ్యం స్ధాపనకు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్ధానిక సంస్ధల బలోపేతంతో పాటు ఆర్ధికంగా వాటిని స్వయంసమృద్ధి దిశగా తీసుకున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ ప్రస్తావించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు.
News February 11, 2025
18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ
సుమారు 18వేల ఏళ్ల క్రితం యూరప్‌లో నరమాంస భక్షణ జరిగేదని UK పరిశోధకులు తెలిపారు. పోలాండ్‌లోని ఓ గుహలో దొరికిన అవశేషాలపై అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందన్నారు. ‘ఆ ఎముకల మీద ఉన్న గుర్తుల్ని బట్టి అవి నరమాంస భక్షణకు గురైనట్లుగా గుర్తించాం. కాళ్లూచేతుల్ని ముక్కలుగా నరకడం, మెదడును బయటికి తీయడం వంటి పలు ఆనవాళ్లు వాటిపై ఉన్నాయి. 2 గ్రూపుల మధ్య యుద్ధంలో విజేతలు ఓడినవారిని తినేసి ఉండొచ్చు’ అని అంచనా వేశారు.
News February 11, 2025
సంగారెడ్డి: 696 మంది పంచాయతీ ఎన్నికల సిబ్బంది నియామకం
సంగారెడ్డి జిల్లాలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న 696 మంది ఉపాధ్యాయులను ఆర్వో, ఎఆర్వోలుగా నియమిస్తూ కలెక్టర్ వల్లూరు క్రాంతి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.