News December 31, 2024
రేవ్ పార్టీలో ప.గో.జిల్లా వ్యక్తులే కీలకం
తూ.గో(D) కోరుకోండలోని రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసి మొత్తం 19మందిని అరెస్ట్ చేశారు. గోపాలకృష్ణ అనే వ్యక్తి రూ.18వేలకు ఫంక్షన్ హాల్ బుక్ చేసి పార్టీ నిర్వహించారు. ఇక్కడికి ప.గో. జిల్లా TNK, ఆచంట, గోపాలపురానికి చెందిన 10మంది ఎరువుల డీలర్లను రప్పించారు. కాకినాడకు చెందిన మహిళ ద్వారా ఐదుగురు అమ్మాయిలతో మద్యం తాగుతూ డ్యాన్స్ చేశారు. ఫంక్షన్ హాల్ యజమాని కుమారుడు, 10 మంది డీలర్లపై కేసు నమోదు చేశారు.
Similar News
News January 5, 2025
ప.గో: ముంచేసిన Instagram పరిచయం
పొన్నూరుకు చెందిన రామకృష్ణ అనే ఆర్మీ ఉద్యోగికి ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన ప.గో.జిల్లా మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని రూ.8లక్షలు తీసుకొని మోసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె పిల్లల చదువుకోసం విజయవాడలో ఉంటున్నారు. రామకృష్ణకి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఆమెతో ఇష్టానుసారంగా మాట్లాడారు. మనస్తాపం చెందిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
News January 5, 2025
నరసాపురం: సంక్రాంతికి స్పెషల్ ట్రైన్స్
ప.గో. జిల్లా రైల్వే ప్రయాణికులకు నరసాపురం స్టేషన్ మేనేజర్ మధుబాబు శనివారం తీపి కబురు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 7, 9, 11, 13, 15, 17, 18 తేదీల్లో చర్లపల్లి నుంచి నరసాపురానికి అలాగే నరసాపురం నుంచి చర్లపల్లికి జనవరి 8,10,12,14,16,18,19 తేదీల్లో రైళ్లు నడుపుతున్నట్లు తెలిపారు. ట్రైన్ నెం.07033- 07934 రైలును పరిశీలించాలన్నారు. ఈ రైళ్లు గుంటూరు, విజయవాడ మీదుగా నడుస్తాయన్నారు.
News January 5, 2025
భీమవరం: ‘మంత్రి నారా లోకేశ్ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలి’
జనవరి 6న ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటింనున్నారు. లోకేశ్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.