News April 4, 2025
రేషన్ దుకాణంలో వనపర్తి జిల్లా కలెక్టర్ తనిఖీ

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. గురువారం శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని రేషన్ దుకాణాన్ని సందర్శించి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.
Similar News
News April 8, 2025
GST వృద్ధి రేటుపై అబద్ధాలు చెప్పారు: హరీశ్ రావు

TG: GST వృద్ధి రేటుపై Dy.CM భట్టి విక్రమార్క ప్రజలకు అబద్ధాలు చెప్పారని BRS MLA హరీశ్ రావు ఆరోపించారు. ‘2024-25FYలో GST వృద్ధి 12.3%అని Dy.CM అసెంబ్లీలో చెప్పారు. కానీ అధికారికంగా 5.1% అని తేలింది. ఇది జాతీయ సగటు (10%) కంటే చాలా తక్కువ. అలాగే 2025 మార్చిలో 0% వృద్ధి నమోదైంది. దీనికి ప్రభుత్వ వైఫల్యం, అస్థిరమైన నిర్ణయాలు, రైతు భరోసా వంటి హామీలు నెరవేర్చకపోవడమే కారణం’ అని ట్వీట్ చేశారు.
News April 8, 2025
ముస్తాబాద్: 240 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: కలెక్టర్

సిరిసిల్ల జిల్లాలో మహిళా సంఘాల ద్వారా 191 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం గూడెం, నామాపూర్, పోతుగల్‌లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 3 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంతో మొత్తం జిల్లాలో 240 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
News April 8, 2025
ఆత్మకూరు ప్రైవేట్ ఆసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్‌ఓ

ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేసి పసికందును కోసి బయటకు తీశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లను ఆయన విచారించారు. ఈ ఘటనలో డాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు.