News April 11, 2025
రేషన్ లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన పొంగులేటి

పినపాక నియోజకవర్గం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో సన్నబియ్యం పథకం అమలులో భాగంగా లబ్ధిదారుడు వంకా శివలక్ష్మి ఇంట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ శుక్రవారం భోజనం చేశారు. పేదల సంక్షేమం కోసమే ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
Similar News
News April 19, 2025
పెద్దపల్లి: PACS కొనుగోలు కేంద్రాలు సిద్ధం

పెద్దపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సిద్ధమయ్యాయి. పీఏసీఎస్ పరిధిలో 200కు పైగా కొనుగోలు కేంద్రాలకు రైతుల తమ ధాన్యాన్ని తరలిస్తున్నారు. దాదాపు 90% వరి కోతలు పూర్తయ్యాయి. మరో నెల రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ కూడా పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.
News April 19, 2025
కూటమి వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్ష : ధర్మాన

రాష్ట్రంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం వైఫల్యాలే వైసీపీకి శ్రీరామరక్షగా నిలుస్తాయని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. శనివారం తాడేపల్లి కార్యాలయంలో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. లేనిపోని హామీలను గుప్పించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. గడిచి పది నెలలు పూర్తైనా నెరవేర్చలేకపోయారని విమర్శించారు.
News April 19, 2025
IPL: టాస్ గెలిచిన గుజరాత్

అహ్మదాబాద్‌లో మొదలుకానున్న GTvsDC మ్యాచ్‌లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాయింట్స్ టేబుల్‌లో ఢిల్లీ అగ్రస్థానంలో, గుజరాత్ మూడో స్థానంలో ఉన్నాయి.
DC: పోరెల్, కరుణ్, కేఎల్, అక్షర్, స్టబ్స్, అశుతోశ్, విప్రాజ్, స్టార్క్, కుల్‌దీప్, ముకేశ్, మోహిత్
GT: సుదర్శన్, గిల్, బట్లర్, షారుఖ్, తెవాటియా, రషీద్, అర్షద్, సిరాజ్, కిశోర్, ప్రసిద్ధ్, ఇషాంత్