News April 5, 2025
రేషన్ లబ్ధిదారుల ఇంట్లో తింటాం: నిర్మల్ కలెక్టర్ అభిలాష

సన్న బియ్యం పంపిణీ పట్ల జిల్లా ప్రజల నుంచి మంచి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సన్న బియ్యం పంపిణీకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తీ ఏర్పాట్లను చేశామన్నారు. ప్రతి నెల సన్నబియ్యాన్ని సమయానికి ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. త్వరలోనే సన్న బియ్యం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన భోజనాన్ని స్వీకరిస్తామని చెప్పారు.
Similar News
News April 5, 2025
కేసీఆర్‌తో సమావేశమైన నల్గొండ బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలు విజయవంతం చేయడానికి జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలను కేసీఆర్‌కు వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
News April 5, 2025
CSKvsDC: చెన్నై టార్గెట్ ఎంతంటే?

చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 183/6 స్కోర్ చేసింది. మెక్‌గుర్క్ డకౌట్ కాగా కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వీ 20, స్టబ్స్ 24* రన్స్ చేశారు. ఖలీల్ అహ్మద్ 2, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. విజయం కోసం చెన్నై 184 పరుగులు చేయాలి.
News April 5, 2025
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు

HYD నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయనున్నారు. మిలీనియం బ్లాక్‌లో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ మాలెంపాటి అమరేశ్ రావు నేతృత్వంలో ఈ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. తల్లిదండ్రుల ఆధార్, రేషన్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రంతో ఉ.10 నుంచి సా.4 వరకు పాత భవనం మొదటి అంతస్తు ఆరో వార్డులో సంప్రదించాలి.