News April 6, 2025
రేషన్ లబ్ధిదారుల ఇంట్లో MLA కోమటిరెడ్డి భోజనం

చౌటుప్పల్: రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ద్వారా సన్నబియ్యం పంపిణీని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పంతంగి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు భోజనం చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 17, 2025
పార్వతీపురం: సమతా ఎక్స్‌ప్రెస్ రద్దు

విశాఖ- నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్‌ను (12807/12808) ఈనెల 30 నుంచి మే 8 వరకు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. నాగపూర్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రాకపోకలను నిలిపివేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.
News April 17, 2025
హార్వర్డ్‌కు ట్రంప్ మరో షాక్?

హార్వర్డ్ వర్సిటీకి US అధ్యక్షుడు ట్రంప్ మరో షాకివ్వడం ఖాయంగా తెలుస్తోంది. రాజకీయ, సైద్ధాంతిక, ఉగ్రవాద ప్రేరేపిత వైఖరిని అవలంబిస్తోందని వర్సిటీపై కన్నెర్ర చేసి ఇప్పటికే పలు కాంట్రాక్టులు, నిధులు స్తంభింపజేశారు. తాజాగా, ట్యాక్స్ మినహాయింపు హోదాను రద్దు చేయాలని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ న్యాయవాదిని కోరినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. 1980లోనూ ఇలా పన్ను మినహాయింపు రద్దు నిర్ణయం సంచలనం రేపింది.
News April 17, 2025
ALERT: నెత్తురోడుతున్న హైదరాబాద్!

HYDలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో 790 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రమాదాల్లో ఏకంగా 70 మంది చనిపోవడం గమనార్హం. త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించకపోవడం, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడంతోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందుకు సంబంధించిన యాక్సిడెంట్ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన పోలీసులు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇకనైనా ట్రాఫిక్ రూల్స్ పాటించండి.
SHARE IT