News February 25, 2025

రైలు కిందపడి కాసిపేట యువకుడి సూసైడ్

image

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలానికి చెందిన యువకుడు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి(29) ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహం కావడం లేదని మనస్తాపానికి గురై కల్వరి చర్చి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. రైల్వే ఎస్ఐ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Similar News

News February 25, 2025

హోరెత్తితున్న MLC ఎన్నికల చివరి రోజు మొబైల్ ప్రచారం

image

ఉభయగోదావరి జిల్లాలో నిర్వహించనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మంగళవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఓటర్లు మొబైల్ ఫోన్ కలిగి ఉండడంతో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అభ్యర్థులు, పలువురి అధికారుల రికార్డింగ్ వాయిస్‌‌తో ఫోన్‌లు చేస్తున్నారని ఓట్లరు అంటున్నారు. ప్రతి 5నిమిషాలకు ఫోన్ రావడంతో ఓటర్లు విసుగుచెందుతున్నట్లు పేర్కొన్నారు.

News February 25, 2025

శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి: మంత్రి

image

రాష్ట్ర నలుమూలల నుంచి శ్రీశైలం వచ్చే శివ భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి ఫరూక్ ఆదేశించారు. మంగళవారం మహా శివరాత్రి ఏర్పాట్లపై మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఇతర అధికారులతో సమీక్షించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

News February 25, 2025

ముఖ్రా(కె)లో చెట్లకు క్యూ ఆర్ కోడ్

image

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా(కె) మాజీ స‌ర్పంచ్ గాడ్గె మీనాక్షి ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు కొత్త‌బాట వేశారు. ‘డిజిటల్ ట్రీ ఆధార్’తో ప్రతి చెట్టును జియో-ట్యాగ్ చేయడం, క్యూఆర్‌ కోడ్‌లను కేటాయించారు. పర్యావరణ బాధ్యత అంటే ఇదే! ప్రతి చెట్టు ఆధార్ కార్డులతో పౌరుల వలె వృద్ధి చెందేలా ఈ విప్లవాత్మక ఆలోచనకు మద్దతు ఇద్దామ‌ని BRS మాజీ ఎంపీ సంతోశ్ కుమార్ ఎక్స్ వేదిక‌గా పోస్టు చేసి ఆమెను అభినందించారు.

error: Content is protected !!