News April 30, 2024
రైలు కిందపడి సివిల్ ఇంజినీర్ ఆత్మహత్య

వరంగల్-కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య శాయంపేట రైల్వేగేటు సమీపంలో మంగళవారం ఉ.9గంటలకు రైలు కిందపడి NIT సివిల్ ఇంజనీర్ హిమాన్షుగుప్తా (33) ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవకారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లోంచి బయటకు వచ్చిన హిమాన్ష్‌గుప్తా ఆత్మహత్యకు పాల్పడినట్లు వరంగల్ రైల్వేపోలీసులు తెలిపారు. మృతుడు కాజీపేట ప్రశాంతనగర్ వాసి కాగా.. మృతుడి మిస్సింగ్‌పై ఉదయం కాజీపేటలో భార్యఫిర్యాదు చేశారు.
Similar News
News April 22, 2025
వరంగల్: తేలనున్న 12,321 మంది విద్యార్థుల భవితవ్యం!

వరంగల్ జిల్లాలో ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో ఈ ఏడాది 12,321 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. మొదటి సంవత్సరం జనరల్‌లో 4,967 మంది, ఒకేషనల్- 848, ద్వితీయ సంవత్సరం జనరల్-5,739, ఒకేషనల్ 767 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను వేగంగా Way2News యాప్‌లో చూసుకోవచ్చు. #SHARE IT
News April 22, 2025
ములుగు జిల్లాలో దారుణం.. వ్యక్తి హత్య!

ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిడం సాయి ప్రకాశ్ ఈ నెల 15న హనుమకొండలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. పోలీసులు విచారణ చేపట్టగా ఓ కానిస్టేబుల్ సుపారి గ్యాంగ్‌తో కలిసి సాయి ప్రకాశ్‌ను హత్య చేసినట్లు తెలిసింది. మండలంలో ఎంతోమంది గర్భిణులకు, దివ్యాంగులకు, వృద్ధులకు, ఆదివాసులకు సేవ చేసిన సాయి ప్రకాశ్ మృతితో మండలంలో విషాదం నెలకొంది.
News April 22, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839 చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.