News February 16, 2025
రైలు ఢీకొని అనంత జిల్లా జవాన్ మృతి

అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రానికి చెందిన BSF జవాన్ లక్ష్మన్న ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో రైలు ఢీకొని మృతి చెందారు. లక్ష్మన్న తన కుటుంబ సభ్యులతో కలిసి విధుల నిమిత్తం కశ్మీర్‌కు బయలుదేరారు. అయితే ఢిల్లీలో రైలు ఎక్కుతున్న సమయంలో తన భార్య మెడలోని బంగారు చైన్‌ను దొంగ అపహరించి పారిపోతుండగా లక్ష్మన్న పట్టుకోవడానికి ప్రయత్నించారు. అదుపుతప్పి ట్రాక్‌పై పడటంతో మరో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు.
Similar News
News March 14, 2025
జగిత్యాల: హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు అదనపు కలెక్టర్ బి.ఎస్‌లత తో కలిసి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్ దంపతులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిల్లలకి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ పాల్గొన్నారు.
News March 14, 2025
వరంగల్: హోలీ వేడుకల్లో కలెక్టర్ శారద

టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో కలెక్టర్ కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని సూచించారు.
News March 14, 2025
అయ్యో లక్ష్యసేన్: సెమీస్‌కు చేరకుండానే ఇంటికి..

భారత యంగ్ షట్లర్ లక్ష్యసేన్ దూకుడుకు తెరపడింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి ఆయన నిష్క్రమించారు. బర్మింగ్‌హామ్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో తన కన్నా మెరుగైన ర్యాంకర్, చైనా ఆటగాడు లీ షి ఫెంగ్ చేతిలో ఓటమి చవిచూశారు. వరుసగా రెండు గేముల్లో 10-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఆటలో అతడు ఏ దశలోనూ లయ అందుకోలేదు. 2022లో లక్ష్య ఇక్కడ ఫైనల్‌కు చేరడం గమనార్హం.