News April 4, 2025

రైల్వే స్టేషన్‌లో వ్యర్థాలకు నిప్పు.. వందే భారత్‌కు తప్పిన ముప్పు

image

తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో వ్యర్థాలకు గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నిప్పు పెట్టారు. దీంతో పొగ కమ్ముకోవడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అదే సమయంలో అటువైపు వందే భారత్ రైలు రావడంతో సిబ్బంది అప్రమత్తమై కొంతసేపు రైలును ఆపేశారు. స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెనుప్రమాదంతప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News April 8, 2025

NZB: పాప కనిపిస్తే సమాచారం ఇవ్వండి: SHO

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌లో తల్లి పక్కన నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారి రమ్య కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసిందే. సీసీ కెమెరాలో ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు ప్రత్యేక బృందలతో గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి ఆచూకీ తెలిస్తే 8712659837 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ SHO రఘుపతి సూచించారు.

News April 8, 2025

చైనాను హెచ్చరించిన ట్రంప్

image

చైనాకు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమపై విధించిన 34శాతం టారిఫ్‌ను వెనక్కి తీసుకోకపోతే డ్రాగన్ దేశంపై మరో 50శాతం సుంకం విధిస్తామని అల్టిమేటం జారీ చేశారు. రేపటికల్లా పన్నుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. లేకపోతే ఏప్రిల్ 9నుంచి చైనా దిగుమతులపై అదనపు పన్ను ఉంటుందన్నారు. ట్రంప్ డ్రాగన్ వస్తువులపై 34శాతం టారిఫ్‌‌లు వేయగా, బీజింగ్ సైతం అంతే మెుత్తంలో US దిగుమతులపై సుంకాలు విధించింది.

News April 8, 2025

కేంద్ర మంత్రికి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని వివరించిన కమిషనర్

image

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పురోగతిపై ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టి కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి వివరించారు.

error: Content is protected !!