News March 28, 2025
రైల్వేబోర్డు చైర్మన్‌ను కలిసిన ఖమ్మం ఎంపీ

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Similar News
News April 2, 2025
ఖమ్మం: విద్యార్థుల ముసుగులో BRS అరాచకం: మంత్రి

HCU భూ అంశంపై విద్యార్థుల ముసుగులో BRS అరాచకం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. జంతువులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న ఫోటోలు పాతవని స్పష్టం చేశారు. అక్కడి బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదని మంత్రి పొంగులేటి చెప్పారు.
News April 2, 2025
ఖమ్మం: కేంద్రమంత్రితో రాజ్యసభ ఎంపీలు భేటీ

రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్లో ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెంలో విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.
News April 2, 2025
ఖమ్మం: పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

అర్హులైన యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మంగళవారం మధిర మండలం దెందుకూరు గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత దరఖాస్తు దారులతో అదనపు కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు.