News April 6, 2025
రోడ్డు ప్రమాదంలో ASI మృతి

రోడ్డు ప్రమాదంలో ASI మృతి చెందిన ఘటన శనివారం పుత్తూరు(మ) వేపగుంట క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వేపగుంటకు చెందిన రఘుకుమార్ తిరుపతి MRపల్లెలో ఆర్ముడు రిజర్వు పోలీస్ ఫోర్స్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి విధులు ముగించుకుని బస్సులో వస్తూ వేపగుంట వద్ద దిగాడు. అక్కడ రోడ్డు క్రాస్ చేస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Similar News
News April 9, 2025
ఎట్టకేలకు ఆ నరహంతకుడిని తీసుకొస్తున్నారు!

ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి తహవూర్ రాణాను NIA అధికారులు భారత్‌కు తీసుకురానున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులు USకు చేరుకున్నట్లు సమాచారం. ఇవాళ అర్ధరాత్రి లేదా రేపు తీసుకువచ్చే అవకాశముంది. ఢిల్లీలోని NIA హెడ్ క్వార్టర్స్‌లో అతడిని విచారించనున్నారు. ఇప్పటికే అక్కడ భద్రత పటిష్ఠం చేశారు. కాగా పాక్‌కు చెందిన రాణా తనను భారత్‌కు అప్పగించొద్దని కోరగా US సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే.
News April 9, 2025
ఈరోజు సాయంత్రం ‘HIT-3’ సెకండ్ సింగిల్

నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తోన్న ‘హిట్ 3’ సినిమా నుంచి ఇవాళ సెకండ్ సింగిల్ విడుదల కానుంది. ‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ఇవాళ సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘ప్రేమ వెల్లువ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది.
News April 9, 2025
వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.