News February 25, 2025
రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 25, 2025
గుర్రంపోడు తహశీల్దార్ సస్పెండ్

విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా, జిల్లా యంత్రాంగం ఆదేశాలను బేఖాతరు చేసినందుకుగాను సెలవులో ఉన్న గుర్రంపోడు తహశీల్దార్ జి.కిరణ్ కుమార్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనకు గత నెల 6 నుంచి 16 వరకు కలెక్టర్ సెలవులు మంజూరు చేశారు. గడువు దాటినా విధుల్లో చేరకపోవడంతో సస్పెండ్ చేశారు.
News February 25, 2025
శ్రీసత్యసాయి జిల్లా TODAY TOP NEWS

➢ వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ
➢ అనంతపురంలో ఐదుగురికి జీవిత ఖైదు
➢ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
➢ లేపాక్షి మండలంలో యువకుడు ఆత్మహత్య
➢ హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
➢ చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు
➢ లేపాక్షిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➢ ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి
News February 25, 2025
అనకాపల్లి: ‘ఈనెల 27న వారికి సెలవు’

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో పాల్గొనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈనెల 27వ తేదీన ప్రత్యేక క్యాజువల్ లీవు మంజూరు చేస్తున్నట్లు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలు, కళాశాలలకు ఈనెల 26, 27 తేదీల్లో సెలవు ప్రకటిస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.