News February 27, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

image

రొద్దం మండల సమీపంలోని దొమ్మత మర్రివద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో రెడ్డి పల్లి నుంచి లేపాక్షికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని హిందూపురం ఆసుపత్రికి తరలించగా తిరుమలేశ్, భరత్ అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 27, 2025

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

image

ఏపీ, తెలంగాణలో MLC ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 చొప్పున స్థానాలకు ఉ.8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి, APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.

News February 27, 2025

పార్వతీపురం జిల్లాలో 85.60% పోలింగ్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో 15 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 85.60 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. 2,333 మంది టీచర్లకు గాను 1,997 మంది ఓటేశారు. జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

News February 27, 2025

తూ.గో: జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు

image

తూర్పుగోదావరి జిల్లా మీదుగా రాకపోకలు సాగించేందుకు చర్లపల్లి – కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే గురువారం ప్రకటించింది. ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో చర్లపల్లి – (07031) కాకినాడ టౌన్‌కు, మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో కాకినాడ టౌన్ – చర్లపల్లి ( 07032) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. జిల్లాలో రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయని అధికారులు వివరించారు. 

error: Content is protected !!