News November 15, 2024
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి: కరీంనగర్ సీపీ
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి సూచించారు. గురువారం కరీంనగర్ పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్లో యాక్సిడెంట్ జోన్లు, బ్లాక్ స్పాట్లను గుర్తించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులపై పోలీసు అధికారులతో సమీక్షించారు.
Similar News
News November 15, 2024
20న వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చిస్తారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేస్తారు.
News November 14, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవం. @ గన్నేరువరం మండలంలో ట్రాక్టర్ రోటవేటర్ లో ఇరుక్కుని వ్యక్తి మృతి. @ మానకొండూరు మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి. @ భీమారం మండలంలో నృత్యం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన యువకుడు. @ ముగ్గురు సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీసులు. @ జగిత్యాలలో దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.
News November 14, 2024
కరీంనగర్: గ్రూప్-3 ప్రశ్న పత్రాలకు కట్టుదిట్టమైన బందోబస్తు
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.