News January 17, 2025

రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

రోడ్డు భద్రతా మాసోత్సవాలలో వాహన చోదకులను భాగస్వాములు చేసి రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కరపత్రాలు, ఫ్లెక్సీ బ్యానర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాలలో వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News January 17, 2025

కర్నూలుకు పెట్టుబడుల క్యూ.. కారణమిదే!

image

☞ ఓర్వకల్లు విమానాశ్రయం ఉండటం
☞ ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో అందుబాటులో భూమి
☞ హైదరాబాద్‌- బెంగళూరు నగరాలకు మెరుగైన రవాణా సౌకర్యం
☞ సీమ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం
☞ నీటి వనరుల అనుకూలం
☞ సంస్థలకు త్వరితగతిన అనుమతులు
☞ ఓర్వకల్లు విమానాశ్రయంలోని రన్‌వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకునే అవకాశం
☞ కర్నూలు ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ <<15167493>>మంత్రిగా<<>> ఉండటం

News January 17, 2025

ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632

image

ఆదోని మార్కెట్‌లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్‌కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.

News January 17, 2025

గోనెగండ్లలో విషాదం

image

కర్నూలు జిల్లా గోనెగండ్లలో మందు బాబులు ఓ వ్యక్తి ప్రాణం తీశారు. పూటుగా తాగి బైక్‌పై వెళ్తూ స్టేట్ బ్యాంక్ సమీపంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆటో డ్రైవర్ రమేశ్‌ను ఢీకొన్నారు. తలకు తీవ్ర గాయం కావడంతో బంధువులు కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న రమేశ్ కోలుకోలేక శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటన ఆ ఇంట విషాదం నింపింది.