News March 21, 2024

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన హన్మకొండ ఇన్‌స్పెక్టర్

image

2024 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో హన్మకొండ పిఎస్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లందరిపై హన్మకొండ పోలీస్ స్టేషన్లో గురువారం సాయంత్రం హన్మకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News April 10, 2025

WGL: నేడు భారీ వర్షం.. ఎల్లో హెచ్చరిక జారీ

image

ఉమ్మడి WGL జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములోనింబస్ మేఘాల వల్ల వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు WGL, MHBD, జనగామ, HNK, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ములుగులో మోస్తరుగా వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. జర జాగ్రత్త. SHARE IT

News April 9, 2025

వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.

News April 9, 2025

భూపాలపల్లి: పెళ్లి కావట్లేదని యువకుడి సూసైడ్

image

పెళ్లి కావట్లేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చిట్యాల మండలం వెంచరామికి చెందిన లక్ష్మణ్(28) ట్రాక్టర్ డ్రైవర్‌గా చేస్తున్నాడు. తన అమ్మానాన్న చనిపోవడంతో చిన్నమ్మ వద్ద ఉంటున్నాడు. తన కంటే చిన్నవాళ్లకు పెళ్లవుతుందని మనస్తాపంతో పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు. లక్ష్మణ్ చిన్నమ్మ కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!