News August 24, 2024

లక్నవరంలో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 27, 28 తేదీల్లో ములుగు జిల్లాలో పర్యటించునున్నారు. అందులో భాగంగా ఆయన లక్నవరం సరస్సు, ఐలాండ్ సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సుందరీకరణ ఏర్పాట్ల పనులను శనివారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు.

Similar News

News March 11, 2025

వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

image

వరంగల్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్‌లు, బోరుబావులు ఎండిపోయాయి.

News March 11, 2025

వరంగల్: సాగునీటి నిర్వహణ సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష

image

హైదరాబాద్ సచివాలయం నుంచి సాగునీటి నిర్వహణ సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు వరంగల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల వ్యవసాయ విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

News March 10, 2025

నర్సంపేట: అన్ని తామై.. అనాథ యువతుల పెళ్లిళ్లకు ఏర్పాట్లు

image

నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఆశ్రయం పొందిన రోజా, నాగరాణి అనే ఇద్దరు అనాథ యువతులకు ఈనెల 12న వివాహాలు జరగనున్నాయి. ఆ పెళ్లితంతులో భాగంగా సోమవారం అదే ఆశ్రమంలో ఇద్దరు యువతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళల నడుమ మంగళస్నానాలు చేయించారు. ఏ లోటు లేకుండా పెళ్లిళ్లు జరపాలనే సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల ఆశ్రమ నిర్వాహకుడు డా.మోహనరావును ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అభినందించారు.

error: Content is protected !!