News April 22, 2025
లక్షెట్టిపేట: యాక్సిడెంట్.. ఒకరి మృతి

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్(51) మృతి చెందాడని ఎస్సై సురేశ్ తెలిపారు. చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం పౌరోహిత్యం ముగించుకొని వెంకట్రావుపేటకు వెళ్లే క్రమంలో ఎల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.
Similar News
News April 22, 2025
ఉపాధి హామీ పని దినాలు తగ్గించిన కేంద్రం

TG: కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనిదినాలకు తగ్గించింది. గత ఏడాది రాష్ట్రానికి 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈ సారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం రూ.2,708.3 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనున్నారు. కాగా పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.
News April 22, 2025
నా రాజకీయ నిర్ణయం సరైనదే: ఎమ్మెల్యే తెల్లం

నియోజక అభివృద్ధి కోసం తాను తీసుకున్న రాజకీయ నిర్ణయం సరైనదేనని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. దుమ్ముగూడెం మండలంలో పర్యటించి మాట్లాడారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రజలకు చేసిందేమిలేదని విమర్శించారు. భద్రాచలం అభివృద్ధికి రూ. 100 కోట్లు నిధులిస్తామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారన్నారు. భద్రాద్రికి అభివృద్ధికి తొలి విడతగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 34 కోట్లు మంజూరు చేసిందన్నారు.
News April 22, 2025
కర్నూలు జిల్లాలో ఆశాజనకంగా పత్తి ధరలు.!

కర్నూలు జిల్లాలో వారం రోజుల్లో పత్తి ధరలు పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో దూది గింజల ధర స్వల్పంగా పెరగడం, పత్తి జిన్నింగ్ ప్రెస్సింగ్ పరిశ్రమల ఉత్పత్తికి అవసరమైన పత్తి మార్కెట్‌కి రాకపోవడంతో ధరలు పెరిగాయి. ఆదోని మార్కెట్‌లో సోమవారం పత్తి క్వింటాల్ ధర గరిష్ఠంగా రూ.8,179 గా ఉంది. గత వారంతో పోలీస్తే రూ.200లకు పెరిగింది. కనిష్ఠ ధర రూ.4,509 ఉండగా సగటు ధర రూ.7,589కి పలికింది.