News March 19, 2025
లక్షెట్టిపేట: ‘వసంత అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు’

లక్షెట్టిపేట పట్టణంలో కొత్తశ్యామల మెడలో బంగారు గొలుసును దొంగిలించిన నిందితురాలు సముద్రాల వసంతను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండుకు పంపామని సీఐ అల్లం నరేందర్, ఎస్సై సతీష్ తెలిపారు.16న శ్యామల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో వసంత ప్లాన్ ప్రకారం శ్యామల మెడలోని సుమారు 3 తులాల పుస్తెలతాడును దొంగలించి పారిపోయిందన్నారు. శ్యామల ఫిర్యాదు మేరకు వసంతను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపామని వారు తెలిపారు.
Similar News
News March 19, 2025
SRPT: పది పరీక్షలకు సర్వం సిద్ధం: కలెక్టర్

సూర్యాపేట జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. 67 పరీక్షా కేంద్రాల్లో 11,912 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఉ. 9:30 నుంచి మ. 12:30 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 67 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News March 19, 2025
కామారెడ్డి: చేపల వలలో చిక్కుకొని జాలరి మృతి

చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News March 19, 2025
నేడే బడ్జెట్.. జనగామ జిల్లాకూ కావాలి నిధులు..!

నేడు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనగామ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న చెన్నూరు రిజర్వాయర్, పాలకుర్తి రిజర్వాయర్, జనగామ మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇండస్ట్రియల్ పార్కులు, పాలకుర్తిలో 100 పడకల ఆసుపత్రితో పాటు పలు కొత్త ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.