News March 4, 2025
లక్ష్మణరావు 3సార్లు గెలిచి.. ఈసారి ఓడారు.!

గతంలో మూడు సార్లు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన కేఎస్ లక్ష్మణరావుకు ఈసారి ఓటమి ఎదురైంది. ఈయన 2007, 2009లో కృష్ణ-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందారు. అయితే 2015 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. తిరిగి 2019ఎన్నికల్లో గెలుపొందగా.. 2025లో ఓడారు. ఈయన గతంలో గుంటూరు హిందు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశారు. నిరుద్యోగులకు తరగతులు చెప్తూ పేరుపొందారు. ఉపాధ్యాయుల వివిధ సమస్యలపైన పోరాడారు.
Similar News
News March 4, 2025
సబ్సిడీ రుణాల లబ్ధిదారులను ఎంపిక చేయండి: కలెక్టర్

ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వివిధ సబ్సిడీ రుణాల మంజూరుకు లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో ఆయా కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై మాట్లాడారు. మార్చి 31లోపు రుణాలు గ్రౌండింగ్ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
News March 4, 2025
రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా చర్యలు

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ హోదా కొనసాగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లా పర్యాటక అధికారి జ్ఞానవేణిని బదిలీ చేశారు. నూతన పర్యాటక శాఖ అధికారిగా జి.దాసును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బీచ్‌లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పర్యాటకులకు పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
News March 4, 2025
విశాఖ: మార్చి 17 నుంచి పదో తరగతి పరీక్షలు

మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు విశాఖ డీఈవో ప్రేమ్ కుమార్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలు సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. మొత్తం 29,997 మంది విద్యార్థులు 134 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నట్లు డీఈవో తెలిపారు.