News May 17, 2024
లక్ష్మీనరసింహస్వామి ఆదాయం ఎంతంటే..?
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,59,135 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.79,758 ప్రసాదం అమ్మకం ద్వారా రూ.65,245 అన్నదానం రూ.14,132 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Similar News
News January 26, 2025
KNR: జిల్లా అధికారులకు మెమోలు జారీ: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కేంద్ర మంత్రి పర్యటనలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన కారణంగా పలువురు జిల్లా అధికారులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శనివారం మెమోలు జారీ చేశారు. శుక్రవారం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనలో అధికారుల సమన్వయ లోపంతో ఇబ్బందులు తలెత్తాయి. పర్యటనకు విధులు కేటాయించిన ACP, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డిస్ట్రిక్ట్ యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్, సంక్షేమ అధికారి, DEO, DRDOలకు మెమోలు జారీ చేశారు.
News January 26, 2025
కరీంనగర్: పట్టణంలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. భారీగా ఆభరణాలు మాయం
కరీంనగర్ పట్టణం అశోక్‌నగర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంటి యజమాని తాళం వేసుకొని ఉదయం వరంగల్‌కు వెళ్లాడు. ఇంటి యజమాని తిరిగి వచ్చే సమయానికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. చూసే సరికి ఇంట్లో ఉన్న 35 తులాల బంగారు ఆభరణాలు, 80 తులాల వెండి, నగదు అపహరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 26, 2025
రేపు ప్రభుత్వం లాంచ్ చేయబోయే 4 పథకాల కోసం ఎంపికైన గ్రామాలు
చిగురుమామిడి – గునుకులపల్లి, చొప్పదండి – చిట్యాలపల్లి, ఇల్లందకుంట – బోగంపాడు, గంగాధర – కురిక్యాల, హుజూరాబాద్ – ధర్మరాజుపల్లి, జమ్మికుంట – గండ్రపల్లి, కరీంనగర్ రూరల్ – బహద్దూర్ ఖాన్ పేట, కొత్తపల్లి – బద్దిపల్లి, మానకొండూర్- ముంజంపల్లి, రామడుగు – దేశరాజ్ పల్లి, శంకరపట్నం – ఇప్పలపల్లి, తిమ్మాపూర్ – కొత్తపల్లి, సైదాపూర్ – వెన్కెపల్లి, వీణవంక – శ్రీరాములపేట, గన్నేరువరం – గుండ్లపల్లి