News July 13, 2024

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన పోచారం

image

కోటగిరి మండల కేంద్రంలో లబ్ధిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. 91 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 22 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. బోధన్ ఆర్డీవో రాజేశ్వర్, పోతంగల్ ఎమ్మార్వో మల్లయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు శంకర్, లక్ష్మణ్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 8, 2025

NZB: అప్పుల బాధతో వాచ్‌మెన్ ఆత్మహత్య

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి పురుగుమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు 4 టౌన్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. నవీపేటకు చెందిన రేపన్ శంకర్ (58) ఎల్లమ్మ గుట్టలోని అమ్మ వెంచర్‌లో వాచ్మెన్‌గా పనిచేస్తున్నారు. కూతురు పెళ్లి, ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేశాడు. అప్పు తీర్చలేక మనోవేదనకు గురై రెండు రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

News February 8, 2025

NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రాం

image

ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన మోపాల్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇంస్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.

News February 8, 2025

NZB: ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చాలి: కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన HMలు, MEOల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు.

error: Content is protected !!