News April 7, 2025

లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

image

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.  

Similar News

News April 10, 2025

SKLM: సమస్యల పరిష్కారమే లక్ష్యం

image

గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణం పరిష్కరించే  దిశగా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. గురువారం టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్‌కి చెందిన అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రీసర్వే, పీజీఆర్ఎస్, పౌర సేవల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.

News April 10, 2025

శ్రీకాకుళం DMHOగా సుజాత

image

శ్రీకాకుళం జిల్లా DMHOగా డాక్టర్. బి.సుజాతకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ బండారు సుబ్రహ్మణ్యేశ్వరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు DMHOగా పనిచేసిన బాలమురళీకృష్ణ ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. సుజాత ప్రస్తుతం విశాఖ రీజినల్ ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

News April 10, 2025

నరసన్నపేట : ముగ్గుల పోటీల్లో రూ. 25 లక్షల ప్రైజ్ మనీ

image

ముగ్గుల పోటీలలో నరసన్నపేటకు చెందిన మహిళ రూ.25 లక్షలు గెలుచుకున్నారు. ఆంధ్రా అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆన్‌లైన్‌ విధానంలో పోటీలు నిర్వహించారు. ఇందులో సునీత మొదటి బహుమతిని గెలుచుకున్నారు. లక్షల రూపాయలు గెలుచుకోవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.  

error: Content is protected !!