News May 17, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు: HYD కలెక్టర్‌

image

స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని HYD కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి మల్టీ మెంబర్‌ అప్రైపియేట్‌ అథారిటీ కమిటీ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌‌లోని ప్రతీ స్కానింగ్‌ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఫొటోలు తీయాలని కలెక్టర్ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు.

Similar News

News October 5, 2024

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం: చంద్రశేఖర్

image

రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో 45 శాతం ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చిందని జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల నుంచి రూ.3,195 కోట్ల ఆదాయం వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం రావడం జరిగిందన్నారు.

News October 5, 2024

శంషాబాద్‌: తండ్రిని హత్య చేసిన కొడుకు

image

రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. శంషాబాద్‌లో తండ్రిని కొడుకు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రారెడ్డి కాలనీకి చెందిన రాములు తరచూ మద్యం తాగి గొడవ పడేవాడు. ఈ క్రమంలో రాములు తన కూతురు ఇంటి వద్ద గొడవ పడటంతో కోపోద్రిక్తుడైన అతడి కొడుకు శివకుమార్ గొడ్డలితో నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News October 5, 2024

శేరిలింగంపల్లి: దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

image

దసరా సందర్భంగా HCU ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హెచ్‌సీయూ డిపో మేనేజర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 12వ వరకు నడుపుతామన్నారు. లింగంపల్లి నుంచి MGBS వరకు, గచ్చిబౌలి నుంచి మహబూబ్ నగర్ వైపు, లింగంపల్లి నుంచి జహీరాబాద్ వైపు బస్సులు ఉంటాయని వివరించారు. వివరాలకు ఫోన్ నంబర్ 7382814235ను సంప్రదించాలని సూచించారు.