News February 13, 2025
లెదర్ పార్క్ పై కొరియన్ బృందంతో జిల్లా కలెక్టర్ భేటీ

నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కొరియన్ కంపెనీ బృందం సభ్యులతో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఈడీబి రంజిత్ సమావేశంలో పాల్గొన్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసే లెదర్ పార్క్ స్థల పరిశీలన పై వారు చర్చించారు. పరిశ్రమ ఏర్పాటుతోపాటు పలు అంశాలను సుదీర్ఘంగా చర్చించారు. లెదర్ పార్క్ ఏర్పాటు ప్రయోజనాలను బృందం సభ్యులకు వివరించారు.
Similar News
News December 15, 2025
ఒక్క ఓటుతో సర్పంచ్ పీఠం

TG: హోరాహోరీగా సాగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలిచారు. కరీంనగర్ జిల్లాలోనే ఐదుగురు ఇలా సర్పంచ్ పీఠం ఎక్కారు. కొత్తపల్లిలో శోభారాణి, పెద్దూరుపల్లిలో రామడుగు హరీశ్, మహాత్మనగర్‌లో పొన్నాల సంపత్, ముంజంపల్లిలో నందగిరి కనక లక్ష్మి, అంబల్ పూర్‌లో వెంకటేశ్ ఓటు తేడాతో విజయం సాధించారు. వరంగల్(D) ఆశాలపల్లి కొంగర మల్లమ్మ, నల్గొండ(D) ధన్‌సింగ్ తండాలో ధనావత్ కూడా ఇలా గెలిచారు.
News December 15, 2025
కర్నూలు రేంజ్‌లో 15 మంది ఎస్‌ఐల బదిలీ

కర్నూలు రేంజ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 15 మంది ఎస్‌ఐలకు పరిపాలనా కారణాల దృష్ట్యా బదిలీలు చేపట్టినట్లు డీఐజీ డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సిఫారసుల మేరకు ఈ బదిలీలు అమలులోకి వచ్చాయి. బదిలీ అయిన ఎస్‌ఐలను వెంటనే రిలీవ్ చేసి, కొత్త విధుల్లో చేరేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు, నంద్యాల ఎస్పీలకు డీఐజీ ఆదేశించారు.
News December 15, 2025
నరసరావుపేట కలెక్టరేట్‌లో పొట్టి శ్రీరాములుకు నివాళి

నరసరావుపేట కలెక్టరేట్‌లో సోమవారం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీరాములు సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు.


