News March 27, 2025

లేపాక్షి: పరీక్షలు సరిగా రాయలేదనే భయంతో..

image

లేపాక్షి మండలం పులమతి సడ్లపల్లి గ్రామానికి చెందిన బాబు అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాబు పదో తరగతి పరీక్షలు సరిగా రాయలేదని, పరీక్షల్లో ఫెయిల్ అయితే ఇంట్లో ఇబ్బంది కలుగుతుందనే భయంతో గురువారం మధ్యాహ్నం ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు బాబును హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News April 1, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు ☞జూన్‌లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ ☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు ☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం ☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు ☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు ☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు

News April 1, 2025

గద్వాల: NSUI సంఘం నేతలపై పెట్టిన కేసు కొట్టివేత

image

గత ప్రభుత్వ హయాంలో విద్యార్థి సంఘాల నేతలపై పెట్టిన కేసులతో తీవ్ర ఇబ్బంది పడ్డారని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని న్యాయబద్ధంగా పోరాడితే అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు బనాయించారని NSUI గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ చొరవతో న్యాయవాది సురేశ్ గౌడ్ నేతృత్వంలో తనపై పెట్టిన 491/21 కేసును కొట్టివేస్తూ గద్వాల జడ్జి తీర్పునిచ్చారని తెలిపారు.

News April 1, 2025

CBG యూనిట్లతో 2.5 లక్షల మందికి ఉద్యోగాలు: టీడీపీ

image

AP: రాబోయే ఐదేళ్లలో రిలయన్స్ కంపెనీ రాష్ట్రవ్యాప్తంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్(CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనుందని TDP వెల్లడించింది. రేపు కనిగిరిలో CBG యూనిట్‌కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన చేస్తారని తెలిపింది. ‘ఈ ప్లాంట్లకు అనుబంధంగా ఎనర్జీ ప్లాంటేషన్ ద్వారా 5L ఎకరాల బంజరు భూమి ఉపయోగంలోకి వస్తుంది. దీనివల్ల 2.5L మందికి ఉద్యోగాలు వస్తాయి. ఏటా 40L మె.టన్నుల గ్యాస్ ఉత్పత్తి అవుతుంది’ అని పేర్కొంది.

error: Content is protected !!