News February 10, 2025

లోకసభ స్పీకర్‌ను అయ్యన్న ఆహ్వానం

image

రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణంరాజు సోమవారం ఢిల్లీలో లోకసభ స్పీకర్ ఓంబిర్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 22వ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్లో రెండు రోజులపాటు ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని లోకసభ స్పీకర్‌ను కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

Similar News

News February 11, 2025

కరీంనగర్: ఊరంతా బీసీ కమ్యూనిటీ వారే..!

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ఊరంతా బీసీ కమ్యూనిటీకి చెందిన వారు ఉండటం గమనార్హం. గ్రామంలో 750 జనాభా ఉండగా 623 ఓటర్లు ఉన్నారు. గ్రామంలో ఆరె, పద్మశాలి, కుర్మ, ముదిరాజ్, కమ్మరి, వడ్రంగి కులాలు చెందిన వారు మాత్రమే ఉన్నారు. ఈ గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, రెడ్డి కులాలకు చెందిన వారు లేరు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కమ్యూనిటీ వారికే అవకాశం లభిస్తుంది.

News February 11, 2025

వేల్పూరులో బర్డ్ ఫ్లూ నిర్ధారణ: జిల్లా కలెక్టర్

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా బర్డ్ ఫ్లూ వ్యాపిస్తుండడంతో జిల్లా కలెక్టర్ నాగరాణి మంగళవారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తణుకు మండలం వేల్పూరులోని కృష్ణానంద పౌల్ట్రీ ఫామ్ లో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్లు చెప్పారు. వేల్పూరు నుంచి పది కిలోమీటర్ల వరకు అలర్ట్ జోన్ ప్రకటించారు. చికెన్, కోడిగుడ్లు అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అన్ని షాపులను మూసివేయాలని సూచించారు.

error: Content is protected !!