News March 13, 2025
లోకేశ్వర్ రెడ్డిపై దాడి టీడీపీ నేతల పనే: YCP

కోవెలకుంట్ల మం. కంపమల్లలో YCP <<15743280>>నేత<<>> లోకేశ్వర్ రెడ్డిపై TDP నేతలే హత్యాయత్నం చేశారని YCP ఆరోపించింది. ‘పొలంలో ఉన్న లోకేశ్వర్ రెడ్డిపై రాడ్లతో దాడి చేశారు. అతని ఇంటిపైనా దాడికి పాల్పడటంతో లోకేశ్వర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి, తమ్ముడు వెంకటేశ్వర రెడ్డికి గాయాలయ్యాయి. ఇంకెన్నాళ్లు ఈ దౌర్జన్యాలు’ అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితను ప్రశ్నిస్తూ వైసీపీ ట్వీట్ చేసింది.
Similar News
News December 13, 2025
రాహుల్ గాంధీతో ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ హైదరాబాద్ వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట ఛార్టెడ్ ఫ్లైట్‌లో ఆయన హస్తినకు వెళ్తారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రేపు కాంగ్రెస్ నిర్వహించనున్న నిరసనలో సీఎం పాల్గొంటారు.
News December 13, 2025
కొండపి: తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులు

కొండపి పొగాకు వేలంకేంద్రంలో కొనుగోళ్లు ముగిసినప్పటికీ రైతులకు తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. సుమారు వేలం 9నెలల పాటు నిర్వహించడంతో పండించిన పొగాకు నాణ్యత కోల్పోయి ఆశించినంత మేర ధరలు రాక రైతులు నష్టాల బాట పట్టారు. బోర్డ్ అధికారులు రైతులకు సగటు ధర ఇప్పించడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. ఒక్కో బ్యారర్‌కు రూ.2లక్షల పైబడి నష్టం వాటిలినట్లు రైతులు వాపోతున్నారు.
News December 13, 2025
15న విశాఖలో వైసీపీ కోటి సంతకాల ర్యాలీ: కేకే.రాజు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమానికి పలు వర్గాల ప్రజల నుంచి విశేష ఆదరణ లభించిందని జిల్లా అధ్యక్షుడు కేకే.రాజు అన్నారు. శనివారం YCP కార్యాలయంలో నేతలతో సమావేశమయ్యారు. డిసెంబర్ 15న GVMC గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లన్నున్నట్లు తెలిపారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం వినతి పత్రాలను తాడేపల్లికి ఆరోజు పంపనున్నట్లు చెప్పారు.


