News April 7, 2024
వంశధార నదిలో అడుగంటిపోతున్న జలాలు

వేసవి కాలం ఆరంభం కావడంతో వంశధార నీటి జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నదులు జల కళను కోల్పోతున్నాయి. తీర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వంశధార ప్రాజెక్టుకు సైతం నీటి జాడలు తగ్గిపోతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న దాంట్లో 150 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా అధికారులు విడిచిపెడుతున్నారు.
Similar News
News April 5, 2025
వజ్రపుకొత్తూరు: బాతుపురంలో నెమళ్ల సందడి

వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామంలో శుక్రవారం నెమళ్లు సందడి చేశాయి. గ్రామం సమీపంలోని కొండల ప్రాంతం నుంచి నెమళ్లు గ్రామానికి చేరుకుని గ్రామంలోని చెట్లపై కనిపిస్తూ కనువిందు చేశాయి. అటవీ ప్రాంతంలో ఉండాల్సిన నెమళ్లు జనావాసాల్లోకి వస్తుండటంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా నెమళ్లు రాక గ్రామస్థులకు ఆహ్లాదాన్ని ఇచ్చింది.
News April 5, 2025
SKLM: అలెర్ట్.. రైళ్ల గమ్య స్థానాల్లో మార్పులు

పలాస, శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే షాలిమార్- వాస్కోడగామా(VSG) అమరావతి ఎక్స్‌ప్రెస్ రైళ్ల గమ్యస్థానంల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ నిర్వహణ పనులు జరుగుతున్నందున ఈనెల 17- 28 వరకు నం.18047 SHM- VSG రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ వరకు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి మే 1 వరకు నెం.18048 VSG- SHM రైలు వాస్కోడగామాకు బదులుగా హుబ్లీ నుంచి నడుస్తాయన్నారు.
News April 5, 2025
SKLM: మెగా డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

మెగా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఈడబ్ల్యూఎస్ (ఈబీసీ) అభ్యర్థులకు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ శ్రీకాకుళం ఉచిత ఆన్‌లైన్ శిక్షణను అందించనున్నట్లు సంస్థ సంచాలకులు ఈ.అనురాధ తెలిపారు. ఈ మేరకు ఆమె శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.