News February 27, 2025
వట్లూరు పెద్ద చెరువులో స్నానానికి దిగి ఇద్దరు మృతి

పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో గల పెద్ద చెరువులో ఇద్దరు వ్యక్తులు పడి గల్లంతైన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు (58)చెరువులో మునిగిపోతున్న క్రమంలో.. కాపాడేందుకు యత్నించిన తమ్ముడి కుమారుడు సుబ్రహ్మణ్యం (32) మృతి చెందాడు. వారి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 27, 2025
పోసానికి వైద్యపరీక్షలు.. విచారిస్తున్న ఎస్పీ

AP: పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె PSకు తీసుకొచ్చిన పోలీసులు.. అక్కడే వైద్యుడితో మెడికల్ టెస్టులు చేయించారు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని డాక్టర్ గురుమహేశ్ వెల్లడించారు. అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకులు పెద్దఎత్తున అనుచరులతో PSకు రాగా పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు వెనక్కి వెళ్లిపోయారు.
News February 27, 2025
న్యూజిలాండ్ మ్యాచ్‌కు రోహిత్ శర్మ దూరం?

CT: మార్చి 2న NZతో మ్యాచులో IND కెప్టెన్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వొచ్చని క్రీడా వర్గాలు తెలిపాయి. అతని స్థానంలో వైస్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చేస్తారని పేర్కొన్నాయి. PAKతో మ్యాచులో రోహిత్ తొడ కండరాల గాయంతో ఇబ్బందిపడ్డారు. తాజాగా ప్రాక్టీస్ సెషన్‌లోనూ ఆయన యాక్టివ్‌గా పాల్గొనలేదు. దీంతో NZతో మ్యాచుకు హిట్‌మ్యాన్‌కు రెస్ట్ ఇచ్చి రాహుల్‌ను ఓపెనర్‌గా, పంత్‌ను WKగా ఆడిస్తారని వార్తలొస్తున్నాయి.
News February 27, 2025
చిరుత కళేబరానికి పోస్టుమార్టం పూర్తి

శ్రీశైలం క్షేత్ర పరిధి రుద్రపార్కు సమీపంలోని అటవీ ప్రాంతంలో బుధవారం మృతి చెందిన చిరుత కళేబరానికి గురువారం వైల్డ్ లైఫ్ డాక్టర్లు అరుణ్ వెస్లీ ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. తొలుత అనుమానాస్పద స్థితిలో చిరుత మరణించినట్లు అటవీ అధికారులు భావించినప్పటికీ పోస్టుమార్టం రిపోర్టులో మానవ ప్రమేయం లేనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఆ తదుపరి పలు నమూనాలను లేబరేటరీకి పంపించినట్లు అటవీ అధికారులు తెలిపారు.