News March 18, 2025

వనపర్తి: అనధికార లే అవుట్లపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

అనుమతి లేని, అనధికార లే అవుట్లలో ప్లాట్లు కొన్నవారు ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేయించుకోకపోతే ఇబ్బందులు తప్పవని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్‌లో ఎల్ఆర్ఎస్ పేమెంట్ల అంశంపై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో అనుమతిలేని, అనధికార లే అవుట్లపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

Similar News

News March 18, 2025

మంచు లక్ష్మి, కాజల్‌, రానాపై కేసుకు డిమాండ్!

image

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్‌రాజ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 18, 2025

కోడుమూరులో వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు

image

కోడుమూరులోని కర్నూలు రహదారిలో ఉన్న మాజీ సీఎం, దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంగళవారం గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. విగ్రహం తలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కర్నూలు జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, మండల కన్వీనర్ రమేశ్ నాయుడు, కృష్ణారెడ్డి దగ్ధమైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పరిశీలించారు.

News March 18, 2025

నాగారం: పురుగు మందు పాయిజన్‌గా మారి రైతు మృతి

image

వరి పొలానికి రైతు పురుగు మందు కొట్టగా, అస్వస్థతకు గురై మృతి చెందిన ఘటన నాగారం మండలం ఈటూర్ గ్రామంలో జరిగింది. గ్రామస్థుల వివరాలిలా.. గ్రామానికి చెందిన రైతు కొమ్ము మహేశ్ తన పొలంలో రెండు రోజులు పురుగు మందు స్ప్రే చేశాడు. అది బాడీ పాయిజన్ అయి మంగళవారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!