News April 3, 2025

వనపర్తి: ‘ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని పునః సమీక్షించండి’

image

ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని(AEBAS) తక్షణమే పునః సమీక్షించాలని వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సాంకేతిక సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఇతర ప్రత్యామ్నాయ హాజరు విధానాన్ని అనుమతించాలని కోరుతూ గురువారం వనపర్తి డీఎంహెచ్‌వో శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉద్యోగుల వాస్తవ సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

Similar News

News April 10, 2025

OFFICIAL: పూరీ-సేతుపతి సినిమాలో టబు

image

డైరెక్టర్ పూరీ జగన్నాథ్, తమిళ హీరో విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఒక డైనమిక్ క్యారెక్టర్ కోసం ఆమెను తీసుకున్నట్లు తెలిపారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశముంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.

News April 10, 2025

ADB: ‘గోండి భాషలో రచనలు చేయడం అభినందనీయం’

image

నూతన DEO ఏ.శ్రీనివాస్‌రెడ్డిని పండోక్న మహాభారత్ కథా రచయిత తొడసం కైలాస్ కలిసి తాను రచించిన పుస్తకాన్ని బహూకరించారు. DEO మాట్లాడుతూ.. కైలాస్ గోండి భాషలో రచించడం అభినందనీయమని అన్నారు. మారుమూల గిరిజన పల్లెల్లో డ్రాపౌట్ పిల్లలను గత పదేళ్లుగా వారి చదువు కొనసాగేటట్లు ఓపెన్ స్కూల్‌లో జాయిన్ చేసినందుకు కైలాస్‌ను అభినందించారు. MEO సోమయ్య, AMO శ్రీకాంత్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

News April 10, 2025

దారుణం: పీరియడ్స్ వచ్చాయని బయట కూర్చోబెట్టి పరీక్ష

image

తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని ఓ ప్రైవేటు స్కూలులో అమానుష ఘటన జరిగింది. పీరియడ్స్ వచ్చాయనే కారణంతో 8వ తరగతి బాలికను క్లాస్ రూమ్ బయట కూర్చోబెట్టి ప్రిన్సిపల్ 2 రోజులు పరీక్షలు రాయించారు. విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లి స్కూల్‌కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ ఇలా చేయడమేంటని నెటిజన్లు ఫైరవుతున్నారు.

error: Content is protected !!